Keerthy Bhat: అర్ధరాత్రి మెసేజ్.. రెండు లక్షలు మాయం.. కంగుతిన్న బిగ్ బాస్ బ్యూటీ

Keerthy Bhat: అర్ధరాత్రి మెసేజ్.. రెండు లక్షలు మాయం.. కంగుతిన్న బిగ్ బాస్ బ్యూటీ

ఈ మధ్య సైబర్ నేరాల చాలా పెరిగిపోయాయి. టెక్నాలజీ పుణ్యమా అని ఇలాంటి నేరగాళ్ళకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎక్కడో ఉంటూ అకౌంట్స్ మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఈ ఆన్లైన్, యూపీఐ స్మార్ట్ పెమెంట్స్ వచ్చినప్పటినుండి వారి పని చాలా ఈజీగా మారింది. జస్ట్ ఒక లింక్ సెండ్ చేసి కథలన్నీ కాళీ చేస్తున్నారు. అంత ఐపోయాకా లబోదిబో అంటున్నారు బాధితులు. తాజాగా ఇలాంటి పరిస్థితే ఎదురయిందట బిగ్ బిన్ బ్యూటీ కీర్తి భట్ కి.

తాజాగా ఆమె అకౌంట్ నుండి ఏకంగా రెండు లక్షలు కాజేశారట సైబర్ నేరగాళ్లు. ఈ విషయం గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు..  ఆన్లైన్ లో నేనొక ఆర్డర్ పెట్టాను. అది రాకపోవడంతో కొరియర్ సెంటర్ కు కాల్ చేశాను. అడ్రెస్ అప్డేట్ కోసం 2 రూపాయలు పే చేయాలని అడిగారు. రెండు రూపాయలే కదా అని సరే అన్నాను. తరువాత యూపీఐ ఐడీ చెప్పమన్నారు..  నాకు డౌట్ వచ్చి పే చేయనుని చెప్పాను. తరువాత బ్యాంక్‌ అకౌంట్ తో లింకైన నెంబర్ ఇదేనా అని అడిగారు.. అవును అని చెప్పాను. రెండు రూపాయలు కట్ అయినట్టు బ్యాంకు నుండి మెసేజ్ వచ్చింది.

అదే రోజు రూ.99,000 కట్ అయినట్టు మరో మెసేజ్ వచ్చింది. వెంటనే నా బ్యాలెన్స్‌ని చెక్ చేసుకున్నాను. అలా మొత్తం రూ.2 లక్షలు నా అకౌంట్ నుండి కట్ అయ్యాయి. వెంటనే అకౌంట్ బ్లాక్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశాను. అంటూ చెప్పుకొచ్చారు కీర్తి. అంతేకాదు.. ఎవరికైనా ఇలాంటి సమస్య వస్తే వెంటనే.. 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.