
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపార్ జాయ్ ' తుఫాను "అత్యంత తీవ్రమైన తుఫాను"గా మారింది. త్వరలో గుజరాత్ లోని -కచ్ తీరాల వెంబడి మాండ్వి-జాఖౌ ఓడరేవు సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ఇప్పటికే సమీప తీర ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుతం తుఫానుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చాలా భయనకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని గణపతిపూలే అనే పట్టణంలో తీసిన కొన్ని వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తీవ్రమైన అలలు వచ్చి మొత్తం ప్రాంతాన్ని ఆక్రమించుకోవడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా ఉంది.
https://twitter.com/kelkaravadhut/status/1667909287979651073
బిపోర్‌జాయ్ తుఫాను గుజరాత్ లోని కచ్, పాకిస్థాన్‌లోని కరాచీల మధ్య జూన్ 15వ తేదీన తీరాన్ని దాటనుందని భారత వాతావరణశాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు మధ్య అరేబియా తీరంలో కేంద్రీకృతమైన ఈ తుఫాను.. గంటలకు 8 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది.
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 135-150 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో కచ్, సౌరాష్ట్రలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అటు గుజరాత్ తీరంలో అలల ఉద్ధృతి ఎక్కువగా ఉంది. దీంతో జూన్ 15 వరకు అరేబియా సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. తుపాను ప్రభావంతో ముంబయిలో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే గాలుల తీవ్రతతో కొన్ని విమానాలను రద్దు చేశారు. చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.