ఏపీ తీరం దాటిన Fani తుఫాను

ఏపీ తీరం దాటిన Fani తుఫాను

బంగాళా ఖాతంలో ఏర్పడ్డ ఫొని తుఫాన్ ఆంద్రప్రదేశ్ లోని  తీరం దాటింది. దీని ప్రభావం నాలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంది. దాదాపు 10 వేల గ్రామాలు, 52 పట్టణాలు తీవ్రంగా నష్టపోనున్నాయి. తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ ప్రకటించిన ఒడిశా సర్కార్.. 12 లక్షల మందికి పైగా ప్రజలను.. సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పూరి జిల్లాలో మూడున్నర లక్షలు, గంజాం జిల్లాలో మూడు లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఒడిశాలో మొత్తం 5 వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భోజనం, నీళ్లతో పాటు వైద్య బృందాలను అందుబాటులో పెట్టారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. తీరప్రాంతాల్లో 28 ఎన్డీఆర్ఎఫ్, 20 ఓడీఆర్ఎఫ్ టీమ్ లను రెడీ చేశారు. ఆర్మీ, నేవీ , కోస్ట్ గార్డు బృందాలు సహాయ సామాగ్రితో తీరంలో సిద్ధంగా ఉన్నాయి.  ముందు జాగ్రత్తగా తీర ప్రాంతంలో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. గోపాల్ పూర్, పారదీప్ , దమర పోర్టుల్లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

తుపాను తీవ్రతతో.. ఒడిశా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఒక్కరోజే.. ఒడిశాలో 25 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఐదు నదులకు వరద ముప్పు పొంచి ఉండొచ్చని ఒడిశా సర్కార్ ను హెచ్చరించింది.  తీర ప్రాంతాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను సైతం అప్రమత్తం చేశారు. 150కి పైగా రైళ్ల రాకపోకలను రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఫొని ఎఫెక్ట్ తో.. ఒడిశాకు వెళ్లాల్సిన విమాన సర్వీసులను రద్దు చేశారు. భువనేశ్వర్ ఎయిర్ పోర్ట్ ను రాత్రి నుంచి మూసి వేశారు.