జవాద్ తుఫాన్ తో ఒడిశాలో హై అలర్ట్

జవాద్ తుఫాన్ తో ఒడిశాలో హై అలర్ట్

భువనేశ్వర్: జవాద్ తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో జిల్లాల అధికారులను అలర్ట్ చేసింది ఒడిశా సర్కార్. భారీ వానలను తట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేసింది. ముందస్తు జాగ్రత్తగా ముంపు ప్రాంతాలకు రెస్క్యూ టీమ్ లను పంపింది. ఈ తుఫాన్ 14 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపనున్నట్లు ఐఎండీ హెచ్చరించడంతో మరో రెండ్రోజుల వరకు చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను నవీన్ పట్నాయక్ సర్కారు హెచ్చరించింది. కాగా, బెంగాల్ మీదుగా వెళ్తున్న వాయగుండం 24 గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉందని, దానికి జవాద్ గా పేరు పెట్టినట్లు ఐఎండీ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ ఒడిశాలోని గంజాం తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో అలర్ట్ అయిన రాష్ట్ర సర్కారు.. పద్నాలుగు జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో 266 NDRF, SFS, ODRAF టీమ్ లను అరేంజ్ చేసింది.