కుషాయిగూడ, వెలుగు: సిగరెట్లపై ఎంఆర్పీ కంటే అధిక ధర వసూలు చేస్తున్నారని ప్రశ్నించిన యువకుడిపై పాన్ షాప్ యజమాని, మరొకరు దాడికి పాల్పడ్డారు. కుషాయిగూడలోని కృష్ణానగర్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 'పీఎస్ పాన్ మహల్' వద్ద సిగరెట్లు కొనేందుకు వచ్చిన విజయప్రకాశ్ (26), అధిక ధరల గురించి నిలదీయగా, షాప్ యజమాని దుర్భాషలాడుతూ రాడ్తో దాడి చేశారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ రెడ్డి తెలిపారు.
