
అహ్మదాబాద్: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్‌లో దబాంగ్ ఢిల్లీ టీటీసీ జట్టు శుభారంభం చేసింది. ఇండియా స్టార్ ప్యాడ్లర్లు సత్యన్ జ్ఞానశేఖరన్, దియా చితాలే సత్తా చాటడంతో శనివారం జరిగిన టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీ 11-–4 తేడాతో జైపూర్ పేట్రియాట్స్‌పై ఘన విజయం సాధించింది. సింగిల్స్‌లో సత్యన్ 3-–0 తో జీత్ చంద్రను సులభంగా ఓడించగా, దియా చితాలే 2–-1తో తనకంటే మెరుగైన ర్యాంకర్ బ్రిట్ ఇర్లాండ్‌పై గెలిచింది. జైపూర్‌కు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ 2–1తో మరియా జియావోపై విజయం సాధించింది. కానీ, మిక్స్‌డ్ డబుల్స్‌లో సత్యన్–మరియా జియావో జోడీ 3–-0తో కనక్ ఝా–శ్రీజను ఓడించింది.