మేస్త్రి అనుమానాస్పద మృతి..చందానగర్ లో ఘటన

మేస్త్రి అనుమానాస్పద మృతి..చందానగర్ లో ఘటన

చందానగర్, వెలుగు: చందానగర్​లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సుధాకర్ (45) కొంతకాలంగా చందానగర్ శ్రీదేవి థియేటర్ సమీపంలో నివాసం ఉంటూ మేస్త్రి పనులు చేసుకుంటున్నాడు. మూడు రోజులుగా సుధాకర్ గది నుంచి బయటకు రాకపోవడం, లోపలి నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనా స్థలానికి చేరుకున్న చందానగర్ పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా, సుధాకర్ మృతి చెంది ఉన్నాడు. అతను మరణించి రెండు నుంచి మూడు రోజులు అవుతున్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం కోసం ఆసుపత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.