బిల్లులు చెల్లించాలని పాలు పారబోసి నిరసన

బిల్లులు చెల్లించాలని పాలు పారబోసి నిరసన

ఆమనగల్లు, వెలుగు : పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలంటూ పాడి రైతులు శనివారం ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌‌‌‌‌‌‌‌ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పాలు పారబోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయ డెయిరీ రెండు నెలలుగా బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

బిల్లులు ఇవ్వకపోవడంతో వ్యవసాయ పెట్టుబడులకు, పిల్లల చదువులకు, పశుపోషణకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. అనంతరం మిల్చ్‌‌‌‌‌‌‌‌ చిల్లింగ్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌ రాధికకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పాడి రైతులు రామకృష్ణ, సుధాకర్, కృష్ణయ్య, వెంకటేశ్‌‌‌‌‌‌‌‌, జంగయ్య, మహేశ్‌‌‌‌‌‌‌‌, చంద్రయ్య, శ్రీనివాస్, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాజు పాల్గొన్నారు.