రోడ్డుపై పాలు పారబోసిన రైతులు

రోడ్డుపై పాలు పారబోసిన రైతులు

పాల సేకరణ ధరను పెంచాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో డెయిరీ రైతులు రోడ్డెక్కారు. ఎన్నో నెలల నుంచి తమిళనాడలో పాలసేకరణ ధరను పెంచలేదని.. లీటరుకు రూ. 7 పెంచాలని డిమాండ్ చేస్తూ...ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా మధురైలోని ఉసులంపట్టిలో రైతులు రోడ్డుపై ఆందోళన చేశారు. కేన్లలో తీసుకొచ్చిన పాలను నడిరోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. ఆవులు, గేదెలను తీసుకొచ్చి  ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. పాల సేకరణ ధరను పెంచే వరకు  రోడ్డుపై కదలమని భైఠాయించారు.  ఆవు పాల  ధరను రూ. 35కు, గేదె పాల ధరను రూ. 44కు పెంచాలని డిమాండ్ చేశారు. 

రైతులపై ఆగ్రహం...

పాల సేకరణ ధరను పెంచాలని రైతులు తెలిపిన నిరసనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల ధరను పెంచాలని డిమాండ్ బాగున్నా...అనవసరంగా రోడ్డుపై పాలు పారపోయడమేందని పలువురు మండిపడుతున్నారు. తమ డిమాండ్ల కోసం నిరసన తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని సూచిస్తున్నారు. కానీ రోడ్డుపై పాలు పారబోయడం సరికాదంటున్నారు. నిత్యం వేలాది మంది ప్రజలు గుక్కెడు పాల దొరక్క ఇబ్బంది పడుతుంటారని గుర్తు చేస్తున్నాు. రోడ్డుపై పారపోసేందుకు బదులు వాటిని..అనాథలకు, పేదలకు పంచిపెట్టి నిరసన వ్యక్తం చేస్తే బాగుండేదంటున్నారు. తమిళ డెయిరీ రైతులు చేసిన నిరసనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.