న్యూఢిల్లీ: లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్ స్టీన్తో తనకేం సంబంధం లేదని టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా తెలిపారు. ఎప్ స్టీన్ను ఎప్పుడూ కలవలేదని చెప్పారు. ఈ మేరకు ‘ఎక్స్’ లో ఒక ప్రకటన విడుదల చేశారు. ఎప్ స్టీన్ ఫైల్స్లో తనపై వస్తున్న ఆరోపణలన్ని నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఎప్ స్టీన్తో కానీ ఆయన ప్రతినిధులతో కానీ తాను ఎన్నడూ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదని స్పష్టం చేశారు.
ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు, సోషల్ మీడియా పోస్టుల్లో జెఫ్రీ ఎఫ్ స్టీన్తో దలైలామా సమావేశమైనట్టు చూపించడంపై దలైలామా ఆఫీసు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై అసత్య ప్రచారం జరుగుతున్నదని ఆరోపించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ ఫైల్స్లో దలైలామా పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. దాదాపుగా 169 సార్లు ఈ ఫైల్స్లో ఆయన పేరు కనిపించింది. ఈ విషయంపైనే దలైలామా తాజాగా వివరణ ఇచ్చారు.
