
బడంగ్‌పేట,వెలుగు : రంగారెడ్డి జిల్లా బడంగ్ పేట కార్పొరేషన్ దావూద్ ఖాన్ గూడ సర్వే నంబర్.2లో తమ భూములను ఇవ్వాలని స్థానిక దళితులు చేపట్టిన నిరసన దీక్ష శుక్రవారం 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సబిత అధికార పార్టీ కార్యకర్తలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.
తమ తాతల నుంచి సాగు చేసుకుంటున్నామని అడిగితే అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సబిత దగా చేస్తుందని, తమ ఓట్లు లేకుండానే గెలిచారా అని ప్రశ్నించారు. తమ భూములపై హక్కులు కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో గుడ్ల శ్రీనివాస్, రాములు, ముత్యాలు, అంజమ్మ, అండాలు, కళమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.