దళిత మహిళపై వేధింపుల కేసు: సీఐ రాంరెడ్డిపై సునీత ఫిర్యాదు

దళిత మహిళపై వేధింపుల కేసు: సీఐ రాంరెడ్డిపై సునీత ఫిర్యాదు

షాద్ నగర్, వెలుగు: తనపై థర్డ్​ డిగ్రీ జరిగినట్లు షాద్ నగర్ పోలీస్ స్టేషన్​లో బాధితురాలు మల్కాపురం సునీత ఆదివారం ఫిర్యాదు చేశారు. దొంగతనం కేసులో సునీతను అదుపులోకి తీసుకొని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించినది తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో డిటెక్టివ్ సీఐ రాం రెడ్డి, కానిస్టేబుళ్లలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే సంఘటన జరిగిన 18 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్ లో సునీత లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం గమనార్హం. తనను పోలీసులు కొట్టారని ఇన్ని రోజులు చికిత్స పొందుతున్నట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.