రేట్లు పెరిగినా.. అన్నదాతలకు మాత్రం నష్టాలే

రేట్లు పెరిగినా.. అన్నదాతలకు మాత్రం నష్టాలే

రైతులకు కష్టాలు తప్పటం లేదు. దేశవ్యాప్తంగా కూరగాయల రేట్లు భారీగా పెరిగిన అన్నదాతలకు మాత్రం నష్టాలే వస్తున్నాయి. రీసెంట్ గా కురిసిన వర్షాలను తట్టుకొని నిలబడిన కూరగాయల రైతులకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. అస్సాంలో కొత్త రోగం పంటలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. చేతికొచ్చిన పంట పూర్తిగా దెబ్బతింటుందని అంటున్నారు రైతులు. దీంతో టమాట, క్యాబేజీ రైతులు పెద్ద స్థాయిలో నష్టపోతున్నారు. పైకి టమాటాలు మంచిగా కనిపించినా...లోపల మాత్రం పూర్తిగా కరాబవుతుందని చెబుతున్నారు రైతులు. ఒక్కో రైతు ఐదు లక్షలకు పైగే నష్టపోయినట్లు తెలిపారు.