ఎన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచేది కాంగ్రెస్సే : దామోదర్ రాజనర్సింహా 

ఎన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచేది కాంగ్రెస్సే : దామోదర్ రాజనర్సింహా 

మునిపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్  సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం పెద్దగోపులారంలో పోలీసులు చేసిన లాఠీచార్జిలో  కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న  కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ  డిప్యూటీ సీఎం  దామోదర రాజనర్సింహా శుక్రవారం హాస్పిటల్​కు  వెళ్లి  గాయపడిన బాధితులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నాయకులు పోలీసులతో లాఠీచార్జి చేయించారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులు,  కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా గెలిచేది కాంగ్రెసే అన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ రాంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సతీశ్, ఎంపీటీసీ పాండు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజు ఉన్నారు.