వచ్చే నెల 20 వరకు అమలు హైదరాబాద్, వెలుగు: రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్రంలోని షాపులు, హోటళ్లు, ఎస్టాబ్లిష్‌మెంట్లకు ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ కార్మిక శాఖ స్పెషల్ సీఎస్ దానకిషోర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నుంచి మార్చి 20 వరకు ఈ మినహాయింపులు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఉత్తర్వుల ప్రకారం..తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టంలోని కొన్ని నిబంధనల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. దీంతో షాపులు, ఎస్టాబ్లిష్‌మెంట్లు రోజూ ఉదయం 5 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. ఇఫ్తార్, సెహ్రీ సమయాల్లో వ్యాపారాల కోసం ఈ సడలింపు ఇచ్చినట్లు వెల్లడించారు.
