టీడీపోళ్లు బీఆర్ఎస్లకి రాకుండా చూస్కో : దానం నాగేందర్

టీడీపోళ్లు బీఆర్ఎస్లకి రాకుండా చూస్కో : దానం నాగేందర్

టీడీపీని వదిలి వెళ్లిన వాళ్లు తిరిగి పార్టీలోకి రావాలంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు ఇతర పార్టీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారని అన్నారు. టీడీపీని వదిలి వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చే విషయం పక్కన బెడితే ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్నోళ్లు బీఆర్ఎస్ లోకి రాకుండా చూసుకోవాలని సూచించారు. నారాయణగూడలోని బాప్టిస్ట్ చర్చిలో జరిగిన క్రిస్మిస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

బుధవారం ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావంలో పాల్గొన్న చంద్రబాబు తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు.  జ్ఞానేశ్వర్ వంటి నాయకులను ప్రోత్సహించి టీడీపీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. టీటీడీపీని క్రియాశీలకంగా చేయాలని సూచించిన ఆయన.. వివిధ పార్టీలోకి వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతలు తిరిగి రావాలని కోరారు.