హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో సర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల చోరీ జరిగిందని మాజీ మంత్రి దానం నాగేందర్ ఆరోపించారు. తొలగించిన ఓట్లను వెంటనే కలపాలని, లేదంటే ఈసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గురువారం ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్ లో పర్యటించి మీడియాతో మాట్లాడారు.
'ఒక్క హిమాయత్ నగర్ డివిజన్లోనే 20 వేల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ లెక్కన సిటీలో పెద్దసంఖ్యలో ఓట్లు చోరీ అయ్యాయి. కొందరు ఎన్నికల అధికారులు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, పెద్ద సంఖ్యలో ఓట్లు తొలగించారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఓట్ల తొల గింపు ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తం గా జరిగే ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. నా నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్కరి ఓటును కాపాడే బాధ్యత నాపై ఉంటుంది' అని దానం నాగేందర్ పేర్కొన్నారు.
