ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమం : గిన్నిస్ బుక్ రికార్డులో చోటు

ఉమెన్స్ డే ప్రత్యేక కార్యక్రమం : గిన్నిస్ బుక్ రికార్డులో చోటు

గోదావరిఖని: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో మహిళల ప్రత్యేకతను చాటి చెప్పే విధంగా 714 మంది కళాకారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కోలాట నృత్య ప్రదర్శనకు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కింది. జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ కో-ఆర్డినేటర్ డా.రంగజ్యోతి సదరు రికార్డు సర్టిఫికెట్‌ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ కు అందజేశారు. మహిళా జానపద కళాకారులు 714 మంది TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాసిన పాటపై కోలాట నృత్యం చేసి అబ్బురపరిచారు.