సిటీలో దాండియా నైట్స్కు ఏర్పాట్లు

సిటీలో దాండియా నైట్స్కు ఏర్పాట్లు

దేవీ శరన్నవరాత్రుల్లో బతుకమ్మ ఎంత ఘనంగా జరుపుకుంటారో.. దాండియా ఉత్సవాలు కుడా అంతే సందడిగా జరుగుతాయి. సిటీలో ఇప్పటికే  వివిధ రకాల ఈవెంట్ పోస్టర్స్ ని రిలీజ్ చేసి.. టికెట్స్ ను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. దీంతో నగరంలోని దండియా లవర్స్ గర్బా చేసేందుకు రెడీ అవుతున్నారు. 

దసరా వచ్చిందంటే సిటీలో గర్బా ఈవెంట్స్ తో సందడి మొదలవుతుంది. దాండియా లవర్స్ ఈవెంట్స్ వెతుకుంటూ మరీ వెళ్తుంటారు. గత రెండేళ్లగా కరోనా ఎఫెక్ట్ తో.. దాండియా ఈవెంట్స్ కి బ్రెక్ పడింది. ఈ ఏడాది వైరస్ ప్రభావం తగ్గడంతో.... దాండియా లవర్స్.... గార్బా చేసేందుకు సిద్దమవుతున్నారు. 

తొమ్మిది రోజుల పాటు లైవ్ ఆర్కెస్ట్రా , సెలబ్రిటీస్, కలర్ ఫుల్ లైటింట్స్, డీజే పాటలతో దాండియా నైట్స్ సిటీలో ఘనంగా జరుగనున్నాయి. నగరంలో దాదాపు ఈ ఎడాది 50కి పైగా పెద్ద ఈవెంట్స్ జరగబోతున్నాయి.  దీనికోసం సిటీకి ఇంటర్నెషనల్ డీజే ఆర్టిస్టులు రాబోతున్నారు. వీరు ఎక్కువగా సౌండ్ సిస్టమ్స్ బెస్డు గా ఉండే ఈవెంట్లకి వెళ్తుంటారు. పంజాబీ, మరాఠీ, గుజారాతీతో పాటు టాలీవుడ్, బాలీవుబ్ బెస్టు సాంగ్స్ ని డీజే ఆర్టిస్టులు సెలక్ట్ చెసుకుంటున్నారు.

జంట నగరాల్లో హైదరాబాదీలతో పాటు ఉత్తర భారతీయులు ఎక్కువగా ఉండటంతో.. దాండియా ఈవెంట్స్ కి డిమాండ్ పెరిగింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈవెంట్స్ జరుగుతాయి. ఎంట్రీ ఫీజ్ 300 నుంచి 2 వేలకు పైగా ఉంటుంది. కొందరు సింగల్ డే పాసులు తీసుకుంటే .. మరికొందరు ఫుల్ ప్యాకేజ్ పాసులు తీసుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత ఈవెంట్స్ జరుగుతుండటంతో.. ఈవెంట్ మ్యానేజర్స్ తో పాటు..  ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడం కోసం రెడీ అవుతున్నారు సిటీ జనం. కొన్ని ఈవెంట్స్ కు డ్రెస్ కోడ్ ఉంటుందని దాండియా లవర్స్ చెబుతున్నారు.