
- స్పెషల్ కరాచీ మెహందీలో కెమికల్ మిక్స్
- డ్రగ్ కంట్రో ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా కోన్స్ సీజ్
హైదరాబాద్,వెలుగు: కెమికల్స్, యాసిడ్స్‌తో మెహందీ(హెన్నా) కోన్స్ తయారు చేసే ముఠా పట్టుబడింది. కంపెనీపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డీసీఏ) అధికారులు మంగళవారం దాడులు చేశారు.
కల్తీ మెహెందీ కోన్స్ సీజ్ చేశారు. డీసీఏ డీజీ కమలాసన్ రెడ్డి తెలిపిన ప్రకారం.. మెహిదీపట్నంలోని షకీల్ ఇండస్ట్రీస్‌లో ‘స్పెషల్ కరాచీ మెహందీ కోన్’ ప్రొడక్ట్ తయారు చేస్తుండగా.. ఎలాంటి అనుమతులు లేవు. మెహందీ కోన్‌లో కెమికల్స్, యాసిడ్స్ వాడుతున్నట్టు సమాచారం అందింది. దీంతో మంగళవారం కంపెనీలో సోదాలు నిర్వహించి శాంపిల్స్ సేకరించి డ్రగ్ కంట్రోల్ ల్యాబ్‌కి పంపించారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ పాటించకుండా మెహందీని కెమికల్స్ కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. షకీల్ ఇండస్ట్రీస్ ప్రొప్రైటర్ మహ్మద్ యూసుఫ్ అలీని అదుపులోకి తీసుకున్నారు.కోన్లను సీజ్ చేశారు.