క్రికెట్‎లో విరాట్ కోహ్లీ నెంబర్ 2.. నెంబర్ వన్ ఎవరు..?

క్రికెట్‎లో విరాట్ కోహ్లీ నెంబర్ 2.. నెంబర్ వన్ ఎవరు..?

వన్డే క్రికెట్ ఫార్మెట్‎లో నెంబర్ వన్ ఎవరు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సెల్ ప్రకటించిన ర్యాంకింగ్స్‎లో ఇండియన్ ప్లేయర్ ఎంత మంది ఉన్నారు.. టాప్ 10లో భారత ఆటగాళ్లు ఎవరున్నారు అనేది తెలిసిపోయింది. జస్ట్ ఇప్పుడే వన్డే ర్యాంకింగ్స్ ప్రకటించింది ఐసీసీ. 

విరాట్ కోహ్లీ నెంబర్ 2 :

ఇప్పటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న మన విరాట్ కోహ్లీ ఇప్పుడు నెంబర్ 2కు పడిపోయాడు. నెంబర్ వన్ ప్లేసులో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ నిలిచాడు. 
డారిల్ మిచెన్ 845 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చాడు
మన కోహ్లీ 795 పాయింట్లతో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నాడు. 
మిచెల్, కోహ్లీ మధ్య 50 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. 
ఇండియాలో జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్ లో భాగంగా.. డారిల్ మిచెల్ అద్భుతంగా రాణించాడు. మూడు ఇన్నింగ్స్ ఆడి 352 పరుగులు చేశాడు. వీటిలో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ సిరీస్ లో అద్భుతంగా ఆడిన మిచెల్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలోకి వచ్చాడు. 

టాప్ 15లో భారత ఆటగాళ్లు:

నెంబర్ 2 లో విరాట్ కోహ్లీ ఉండగా.. 4వ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు.
5వ స్థానంలో శుభ్ మన్ గిల్.. 10వ ప్లేస్ లో కె.ఎల్ రాహుల్ నిలిచాడు
11వ ప్లేస్ లో శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. 

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు ఇబ్రహీం జాద్రాన్ 764 పాయింట్లతో.. మూడో స్థానంలోకి రావటం విశేషం. 
పాకిస్తాన్ ప్లేయర్ బాబర్ ఆజం 722 పాయింట్లతో.. 6వ స్థానంలో ఉన్నాడు.