బీసీని ముఖ్యమంత్రి చేస్తం : దాసరి అజయ్ కుమార్ యాదవ్

బీసీని ముఖ్యమంత్రి చేస్తం : దాసరి అజయ్ కుమార్ యాదవ్
  • సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్

బషీర్ బాగ్, వెలుగు : అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ అన్నారు. రాష్ట్ర సొమ్మును సీఎం కేసీఆర్ కుటుంబమే దోచుకుందని ఆరోపించారు. బషీర్​బాగ్ ప్రెస్​క్లబ్​లో  44 మందితో కూడిన పార్టీ ఎమ్మెల్యేఅభ్యర్థుల జాబితాను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ యాదవ్  

మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు, సామాజిక తెలంగాణ వస్తుందని సబ్బండ వర్గాలు పోరాటాలు, ఉద్యమాలు చేసి  ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. రాష్ట్రం దొరల చేతిలో బందీ అయిందన్నారు.   కేవలం కల్వకుంట్ల కుటుంబానికే మేలు జరిగిందన్నారు. ధనిక తెలంగాణను సీఎం కేసీఆర్ సుమారు రూ. 5 లక్షల కోట్లు అప్పుల రాష్ట్రంగా చేశాడని విమర్శించారు.