రేవంత్ది నిర్బంధ పాలన: మధుసూదనా చారి : దాసోజు శ్రవణ్

రేవంత్ది నిర్బంధ పాలన: మధుసూదనా చారి : దాసోజు శ్రవణ్
  •  పిరికితనంతో ర్యాలీకిఅనుమతి రద్దు: దాసోజు శ్రవణ్

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ ​ప్రభుత్వం నిర్బంధ పాలన కొనసాగిస్తున్నదని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి ఆరోపించారు. శనివారం ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​తో కలిసి తెలంగాణ భవన్​లో మీడియాతో ఆయన మాట్లాడారు. శాంతియుత ర్యాలీకి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసులను మోహరించి అక్రమ అరెస్టులు చేయడాన్ని ఎవరూ సహించబోరని ఫైర్​ అయ్యారు.

సికింద్రాబాద్​ సంస్కృతి, అస్థిత్వాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో తలసాని శ్రీనివాస్​ యాదవ్​ శాంతియుత ర్యాలీకి పిలుపునిచ్చారని, కానీ, రేవంత్​ రెడ్డి పిరికితనంతో ర్యాలీకి అనుమతి రద్దు చేశారని దాసోజు శ్రవణ్​ అన్నారు. బెదిరింపుల పాలన చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్​ శాస్త్రీయంగా జరగలేదని పేర్కొన్నారు. మల్కాజిగిరి నుంచి గతంలో ఎంపీగా గెలిచినందుకే.. దానిని రేవంత్​ కార్పొరేషన్​గా చేస్తున్నారని శ్రవణ్​ మండిపడ్డారు.