దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే : దాస్యం వినయ్ భాస్కర్

దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే : దాస్యం వినయ్ భాస్కర్

ప్రధాని మోడీ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు కౌంటర్ వేస్తున్నారు.  ప్రధాని మోడీకి  చట్టాలపై గౌరవం లేదని విమర్శించారు ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్.   విభజన చట్టంలోని హామీలను ప్రధాని మోడీ అమలు చేస్తారనుకున్నాం  కానీ.. ఏ ఒక్క హామీపై మాట్లాడకపోవడంతో ప్రజలు నిరాశకు గురయ్యారని అన్నారు. మహారాష్ట్రలో ఎన్నికలు వస్తేనే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారని.. మోడీ, ప్రజలను దగా చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో దేశంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనన్నారు.

తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధిపై బీజేపీ నాయకులు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు వినయ్ భాస్కర్ . సీఎం కేసీఆర్ పై బీజేపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.  బీజేపీ నేతలు దర్యాప్తు సంస్థలతో బీఆర్ఎస్ నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణలో అమలవుతోన్న పథకాలను  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.  కేంద్రప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం లేదన్నారు.  బీజేపీ ప్రభుత్వం బీజేపీ 700 మంది రైతులను పొట్టన  పెట్టుకుందని ఆరోపించారు.