
యూపీలోని ఘజియాబాద్‌లో ఘోరం జరిగింది. ఓ 16 ఏళ్ల కూతురు తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి కన్న తల్లిని చంపింది. ఈ దారుణ ఘటన ఘజియాబాద్‌లోని బ్రిజ్ విహార్ కాలనీలో జరిగింది. ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శశి మాలా తన కూతురుతో కలిసి ఉంటోంది. ఆమె భర్త గోపాల్ ఠాకూర్ బిహార్‌లో ఉంటున్నాడు. కూతురు చదువు కోసం శశి మాలా ఘజియాబాద్‌లో ఉంటుంది. శశి అక్కడి నుంచే తన విధులకు వెళ్లి వచ్చేది. ఒకరోజు ఆమె కూతురు తన బాయ్ ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకొచ్చింది. దాంతో శశి తన కూతురు ప్రవర్తనపై కోపగించుకుంది. అంతేకాకుండా వారిద్దరి బంధానికి అభ్యంతరం చెప్పింది. ఇది నచ్చని శశి కూతురు, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఆమెని చంపింది. శశి ఇంట్లోంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఆమె భర్త గోపాల్‌కు తెలియజేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు వచ్చి చూసేసరికి శశి చనిపోయి రక్తపు మడుగులో పడి ఉంది. జాన్పాడ్ పోలీస్ స్టేషన్‌లో గోపాల్ ఫిర్యాదు మేరకు.. వారి కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ మనీష్ శర్మ తెలిపారు.
For More News..