షాకింగ్.. కూతురు చేసిన పనికి తండ్రికి రూ. 51 లక్షల మెుబైల్ బిల్లు.. ఏమైందంటే..?

షాకింగ్.. కూతురు చేసిన పనికి తండ్రికి రూ. 51 లక్షల మెుబైల్ బిల్లు.. ఏమైందంటే..?

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. లోకమంతా మన గుప్పిట్లోనే ఉన్నట్లు ఫీల్ అయిపోతుంటాం. ముఖ్యంగా సోషల్ మీడియాలో రీల్స్, టిక్‌టాక్ వీడియోల మత్తులో పడితే సమయం, సందర్భం అసలే గుర్తుండవు. సరిగ్గా ఇలాంటి ఒక చిన్న అజాగ్రత్తే ఒక తండ్రికి ఏకంగా 51 లక్షల రూపాయల బ్రిటన్ కరెన్సీలో 42వేల యూరోల మెుబైల్ బిల్లు షాక్ ఇచ్చింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. బ్రిటన్‌కు చెందిన ఆల్టీ కుటుంబానికి ఎదురైన ఈ చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు ఏం జరిగిందంటే?
బ్రిటన్‌కు చెందిన ఆండ్రూ ఆల్టీ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి మొరాకోకు విహారయాత్రకు వెళ్లారు. హాయిగా గడుపుదామని వెళ్లిన ఆ ట్రిప్‌లో ఆండ్రూ తన కూతురు చేతికి ఫోన్ ఇచ్చాడు. అక్కడ వైఫై అందుబాటులో లేకపోవడంతో.. ఆ అమ్మాయి తన తండ్రి బిజినెస్ మొబైల్ డేటాను ఉపయోగించి ఏకంగా 8 గంటల పాటు టిక్‌టాక్‌లో వీడియోలు చూస్తూ టైం పాస్ చేసింది. విదేశీ ప్రయాణాల్లో డేటా రోమింగ్ ఛార్జీలు ఎలా ఉంటాయో ఆ చిన్నారికి తెలియదు.. కానీ ఆండ్రూ కూడా డేటా క్యాపింగ్ గురించి సరిగ్గా చూసుకోకపోవడమే అసలు విలన్ అయ్యింది.

గంటకు 5 లక్షల బిల్లు..
టూర్ మధ్యలో ఉండగానే ఆండ్రూకు ఓ2 నెట్‌వర్క్ నుంచి మొదటి బిల్లు వచ్చింది. అది ఏకంగా 22వేల పౌండ్లు అంటే సుమారు 26 లక్షల రూపాయలుగా బిల్లింగ్ చేసింది. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల లేదా ఫోన్ హ్యాక్ అవ్వడం వల్లే ఇలా జరిగిందని ఆయన సరిపెట్టుకున్నాడు. కానీ ఇంటికి రాగానే మరో 20వేల పౌండ్ల బిల్లు వచ్చి పడింది. మొత్తం కలిపి సుమారు 51.3 లక్షల రూపాయల బిల్లు చూసి దిమ్మతిరిగిపోయింది. లెక్కలు వేసి చూస్తే.. ఆ అమ్మాయి టిక్‌టాక్ చూసిన ప్రతి గంటకు సుమారు 5 లక్షల రూపాయలకు పైగా ఛార్జ్ పడిందనమాట. అయితే బ్రెగ్జిట్ ముందు యూకే ప్రజలకు యూరోపియన్ యూనియన్ అంతగా ఫ్రీ రోమింగ్ సౌకర్యం ఉండేది ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా.

అసలు కారణం అదే..
యూరప్ దాటి వెళ్లినప్పుడు డేటా వినియోగంపై అపరిమిత ఛార్జీలు పడతాయనే రూల్స్ ఆండ్రూ గమనించకపోవడమే ఈ భారీ బిల్లుకు కారణమైంది. సర్వీస్ ప్రొవైడర్ కనీసం హెచ్చరిక కూడా చేయకుండా ఇంత బిల్లు ఎలా వేస్తారని ఆయన వాదిస్తున్నాడు. ప్రస్తుతం ఈ అంశంపై గత రెండు నెలలుగా పోరాటం సాగుతోంది. ఒక సామాన్య వ్యాపారవేత్త ఇంత భారీ మొత్తాన్ని ఎలా చెల్లిస్తాడు? అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్.. మీరు కూడా విదేశాలకు వెళ్లేటప్పుడు మీ డేటా ప్యాక్‌లు, రోమింగ్ ఛార్జీల విషయంలో బీ కేర్‌ఫుల్.. లేదంటే మీ ఎంజాయ్‌మెంట్ కాస్తా ఇలా కాస్ట్లీ గుణపాఠంగా మారే ప్రమాదం ఉంటుంది.