ఆలియా, రణ్‌బీర్‌లకు మహేశ్ విషెస్

ఆలియా, రణ్‌బీర్‌లకు మహేశ్ విషెస్

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆలియా భట్.. ఇటీవలే రణ్ బీర్ కపూర్ ను పెళ్లాడింది. పెళ్లయిన రెండు నెలలకే గుడ్ న్యూస్ చెప్పిన ఈ జంట... తాజాగా పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. దీంతో బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖుల నుంచి వారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆలియా, రణ్ బీర్ లకు విషెస్ చెప్పారు. ఆలియా షేర్ చేసిన ఫొటోను చూపిస్తూ.. "కూతుర్లు చాలా ప్రత్యేకం" అంటూ ఆడపిల్లలపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు.

మహేశ్ బాబు సినిమాల విషయాలకొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో #SSMB 28 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. థమన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక రాజమౌళి దర్శకత్వంలోనూ త్వరలోనే మహేశ్ సినిమా ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కున్న ఈ ఫిల్మ్  మహేశ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ నిలవనుందని సమాచారం.