WTC Final 2025: డబ్ల్యూటీసీ ఫైనల్లో వివాదం: బంతిని చేత్తో పట్టుకున్నా నాటౌట్.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

WTC Final 2025: డబ్ల్యూటీసీ ఫైనల్లో వివాదం: బంతిని చేత్తో పట్టుకున్నా నాటౌట్.. రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో వివాదం చోటు చేసుకుంది. రెండో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ బెడింగ్‌హామ్ చేసిన పని విమర్శలకు దారి తీస్తుంది. గురువారం (జూన్ 12) లంచ్ తర్వాత బెడింగ్‌హామ్ బంతిని చేత్తో పట్టుకోవడంతో వివాదం చెలరేగుతుంది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్యూ వెబ్‌స్టర్ వేసిన బంతిని బెడింగ్‌హామ్ డిఫెన్స్ ఆడే క్రమంలో బ్యాట్ ఎడ్జ్ కు తగిలి అతని ప్యాడ్లలో ఇరుక్కుపోయింది. ఆసీస్ వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ బంతిని ప్యాడ్ లోపల నుంచి తీసి క్యాచ్ అందుకోవాలని ప్రయత్నించాడు.

ఇది గమనించిన సఫారీ బ్యాటర్ బెడింగ్‌హామ్ చేత్తో బంతిని పట్టుకొని కింద పడేశాడు. దీంతో ఆస్ట్రేలియన్ ఫీల్డర్లు అబ్ స్ట్రకింగ్ ఫీల్డ్ అంటూ అంపైర్ కు అప్పీల్ చేశారు. అప్పీల్ తిరస్కరించిన అంపైర్  ఆ బంతిని 'డెడ్ బాల్' గా ప్రకటించాడు. రూల్స్ ప్రకారం ఒక ఆటగాడు బంతిని ఆడినా.. ఆడకపోయినా బాల్ ఆటగాళ్ల ప్యాడ్లలో ఇరుక్కుపోతే అది డెడ్ బాల్ గా పరిగణించబడుతుంది. ఈ రూల్ తో  బెడింగ్‌హామ్ బతికిపోయాడు. అయితే ఈ సఫారీ బ్యాటర్ చేత్తో బంతిని పట్టుకొని కింద పడేయడం విమర్శలకు కారణమవుతుంది. బంతి బ్యాట్ కు టచ్ అయిన తర్వాత బాల్ ను చేత్తో పట్టుకోకూడదు. బంతి పూర్తిగా ప్యాడ్ లోకి ఇరుక్కొకుండానే బెడింగ్‌హామ్ బంతిని పక్కకు నెట్టాడని కొందరు వాదిస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో బౌలర్ల హవానే కొనసాగుతోంది. కంగారూల కెప్టెన్‌‌‌‌ ప్యాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌ (6/28) స్వింగ్‌‌‌‌ దెబ్బకు సఫారీ బ్యాటర్లు చేతులెత్తేశారు. దాంతో 43/4 ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌లో 57.1 ఓవర్లలో 138 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఫలితంగా ఆసీస్‌‌‌‌కు 74 రన్స్‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌ ఆధిక్యం దక్కింది.

డేవిడ్‌‌‌‌ బెడింగ్‌‌‌‌హామ్‌‌‌‌ (45) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. తర్వాత రెండో ఇన్నింగ్స్‌‌‌‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ఆట ముగిసే టైమ్‌‌‌‌కు 40 ఓవర్లలో 144/8 స్కోరు చేసింది. మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌ (16 బ్యాటింగ్‌‌‌‌), నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌ (1 బ్యాటింగ్‌‌‌‌) క్రీజులో ఉన్నారు. అలెక్స్‌‌‌‌ క్యారీ (43) మినహా మిగతా వారు నిరాశపర్చారు. రబాడ, ఎంగిడి చెరో మూడు వికెట్లతో ఆసీస్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ను దెబ్బతీశారు.  ప్రస్తుతం కంగారూలు 218 రన్స్‌‌‌‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రోజుల ఆట మిగిలి ఉంది.