వేలానికి దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు

వేలానికి దావూద్‌ ఇబ్రహీం చిన్ననాటి ఇల్లు

భారత మోస్ట్ వాటెండ్ అండర్ వల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిప  పలు ఆస్తులను అధికారులు త్వరలోవేలం వేయనున్నారు.  మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉన్న దావూద్ చిన్ననాటి ఇల్లుతో పాటుగా అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులను అధికారులు వేలం వేయనున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తి జప్తు) చట్టం (SAFEMA) కింద అధికారులు  దావూద్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.  ముంబైలో శుక్రవారం ఈ వేలం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేలం వేయనున్న ఆస్తులను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి.  

1993 ముంబై వరుస పేలుళ్లలో కీలక నిందితుడైన దావూద్ ఇబ్రహీం 1983లో ముంబైకి వెళ్లడానికి ముందు తన సొంత గ్రామంలో నివసించాడు. 257 మంది మరణానికి కారణమైన బాంబు పేలుళ్ల తర్వాత అతను  దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. మార్చి 12, 1993న జరిగిన ముంబై పేలుళ్లతో దద్దరిల్లింది,  ఈఘటనలో 257 మంది మరణించగా...  700 మందికి పైగా గాయపడ్డారు.  గడిచిన 9 ఏళ్లలో దావూద్‌, అతని కుటుంబ సభ్యులకు సంబంధించిన 11 ఆస్తులను అధికారులు వేలం వేసిన విషయం తెలిసిందే. వాటిల్లో ఒక రెస్టారెంట్‌ను రూ.4.53 కోట్లు, ఆరు ఫ్లాట్లు రూ.3.53 కోట్లకు, గెస్ట్‌ హౌస్‌ రూ.3.52 కోట్లకు అమ్ముడుపోయాయి.