
- వరుసగా 3 వికెట్లతో శార్దూల్ జోరు
- సౌతాఫ్రికా లంచ్ సమయానికి 102/4
సౌతాఫ్రికాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్ రెండో రోజు భారత్ పట్టు బిగించింది. ఓవర్‌నైట్ స్కోరు 35/1తో ప్రొటిస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌతాఫ్రికాను టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఎల్గర్, పీటర్సన్, వాన్ డెర్ డసెన్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో లంచ్ బ్రేక్ సమాయానికి సౌతాఫ్రికా స్కోర్ 102/4. అంతకుముందు టీమిండియా 202 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. రబడ 3, ఒలివర్ 3, మార్కో జాన్‌సెన్ 4 వికెట్లు తీశాడు.