బౌరంపేటలో పట్టపగలు చోరీ..12 తులాల గోల్డ్, రూ.18 వేలు మాయం

బౌరంపేటలో పట్టపగలు చోరీ..12 తులాల గోల్డ్, రూ.18 వేలు మాయం

దుండిగల్, వెలుగు: దుండిగల్ పీఎస్ పరిధిలోని బౌరంపేటలో పట్టపగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది. బౌరంపేటలోని కీర్తి హోమ్స్ 13 నంబర్ ఫ్లాట్ లో కృష్ణారెడ్డి తన ఫ్యామిలీతో కలిసి నివాసముంటున్నారు. తన తల్లిని ఇంటి వద్దే ఉంచి అందరూ కలిసి గురువారం ఉదయం 11 గంటలకు సినిమాకు వెళ్లారు. 

గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పక్కనే ఉన్న 14వ ప్లాట్ నుంచి వీరి ఫ్లాట్​లోకి వచ్చారు. ఇంటి తలుపులు ఓపెన్ చేసి ఉండడంతో ఇంట్లో పైన ఉన్న బెడ్ రూమ్ లోకి నేరుగా వెళ్లారు. 12 తులాల బంగారం, రూ.18 వేలతో ఉడాయించారు. ఇంట్లో అలికిడి కావడంతో కృష్ణారెడ్డి తల్లి అరుస్తూ బయటకు వచ్చారు. దొంగలు ఇంట్లోకి వచ్చి, బయటికి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఘటనా స్థలాన్ని దుండిగల్ సీఐ బాల్ రెడ్డి సందర్శించారు.