జోహన్నెస్‌బర్గ్: ఇండియాతో జరిగే మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లకు సౌతాఫ్రికా జట్లను శుక్రవారం (నవంబర్ 21) ప్రకటించారు. వన్డే టీమ్ కెప్టెన్‌గా టెంబా బవూమ ఎంపికయ్యాడు. ఇటీవల వన్డే రిటైర్మెంట్‌ను వెనక్కుతీసుకొని పాకిస్తాన్‌పై రీఎంట్రీ ఇచ్చిన కీపర్ క్వింటన్ డికాక్ చోటు దక్కించుకున్నాడు.
వన్డే సిరీస్ ఈ నెల30 నుంచి డిసెంబర్ 6 వరకు జరగనుంది. ఆపై, డిసెంబర్ 9న మొదలయ్యే ఐదు టీ20ల సిరీస్‌లో పాల్గొనే టీమ్‌ను ఐడెన్ మార్‌క్రమ్ నడిపిస్తాడు. గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడని పేసర్ అన్రిచ్ నోకియా తిరిగి వచ్చాడు.
అలాగే, వెటరన్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ రెండు జట్లలో స్థానం దక్కించుకున్నాడు. ఇక, టెస్టు సిరీస్‌కు ముందు గాయపడిన స్టార్ పేసర్ కగిసో రబాడ ఈ సిరీస్‌లకు కూడా దూరయ్యాడు. చికిత్స అతను కోసం స్వదేశానికి బయల్దేరాడు.
