
మెదడువాపు వ్యాధితో (అక్యూట్ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ ఏఈఎస్)తో బీహార్‌లో 146 మంది చిన్నారులు మరణించారు. అందులో ఎక్కువ శాతం ముజఫర్‌పూర్‌లోని శ్రీకృష్ణా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోనే చనిపోయారు. ఓవైపు చిన్నారులకు అందించిన ట్రీట్మెంట్పై విమర్శలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు చిన్నారుల మృతదేహాల పట్ల హాస్పిటల్సిబ్బంది వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. పోస్ట్‌మార్టం జరిపాక డెడ్‌బాడీలను ఆస్పత్రి సిబ్బంది కాంపౌండ్‌లోపల దహనం చేశారు. ఆపై ఎముకలను గోడవతల పారేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం శనివారం బయటకు పొక్కడంతో ఆస్పత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 108 చిన్నారుల మృతదేహాలను ఇలాగే దహనం చేసినట్లు సమాచారం. దీనిపై ఎస్కేఎంసీహెచ్మెడికల్ సూపరింటెండెంట్ ఎస్కె షాహి మాట్లాడుతూ.. మృతదేహాల విషయంలో మానవత్వంతో వ్యవహరించి ఉండాల్సిందని అంగీకరించారు. పోస్ట్‌మార్టం పూర్తయ్యాక, క్లెయిం చేయని శవాలను అక్కడి సిబ్బందే ఖననం చేస్తారని చెప్పారు. చిన్నారుల మృతదేహాల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన తీరుపై ప్రిన్సిపాల్‌తో మాట్లాడతానని, దీనికి బాధ్యులను గుర్తించేందుకు అంతర్గత విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. మీడియాలో వార్తల నేపథ్యంలో కలెక్టర్స్పందించారు.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, రిపోర్టివ్వాలని అధికారులను ఆదేశించారు.
బతికినా భారమే..
మెదడువాపు బారినపడ్డ పిల్లలు కోలుకున్నా భవిష్యత్భారంగానే మారనుందని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాధి ప్రభావంవల్ల వారు సాధారణ జీవితం గడపడం సాధ్యంకాదన్నారు. ముజఫర్‌పూర్ జిల్లాలోని గంగాపూర్గ్రామానికి చెందిన మునా దేవీ మనవడు రెండేళ్ల క్రితం ఏఈఎస్బారిన పడి కోలుకున్నాడు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో దక్కాడని మునా దేవీ సంతోషించారు. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ బాలుడి ఆరోగ్యంలో తేడా బయటపడింది. మానసిక, శారీరక ఎదుగుదలపై ఏఈఎస్ప్రభావం ఇప్పటికీ పోలేదని డాక్టర్లు గుర్తించారు. ఏఈఎస్కేసుల్లో 97 శాతం కేసులు ఐదు జిల్లాల్లో(ఈస్ట్చంపారన్, సీతామర్హి, ముజఫర్ పూర్, సమస్థిపూర్, వైశాలి)లోనే నమోదయ్యాయి.
జిల్లాల వారీగా..
జనవరి 3 నుంచి జూన్19, 2019.. ఔరంగాబాద్, బెగుసరాయ్, భోజ్‌పూర్, దర్భంగా, గయ, నలంద, సుపౌల్.. ఏడు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదు. జెహనాబాద్‌లో 2, వెస్ట్చంపారన్లో 3, పాట్నా 4, ఈస్ట్చంపారన్లో 65, షెహర్14, సీతామర్హి 25, సమస్థిపూర్18, వైశాలి 65 కేసులు నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల సంఖ్య 611.