
శంషాబాద్, వెలుగు: ఇజ్రాయెల్ లో మృతి చెందిన జగిత్యాల టౌన్ కు చెందిన రేవెళ్ల రవీందర్(57) డెడ్ బాడీ బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకుంది. అక్కడి నుంచి అంబులెన్స్ లో జగిత్యాలకు డెడ్ బాడీని తరలించారు.
మృతుడికి జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్ తో పాటు ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, బంధువులు ముష్కం కాళీకృష్ణ, భూమయ్య, అంబటి ధీరజ్ గౌడ్ నివాళులర్పించారు. అనంతరం డెడ్ బాడీని సొంతూరుకు తరలించారు.
మాజీ చైర్ పర్సన్ జ్యోతి మాట్లాడుతూ.. గల్ఫ్ దేశాల్లో చనిపోయిన రాష్ట్రానికి చెందిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి అమలులోకి తెచ్చిన రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా స్కీమ్ ఎందరికో ఉపయోగపడిందన్నారు. ఇజ్రాయెల్, మలేసియా, సింగపూర్ వంటి ఇతర దేశాల్లో పోయిన తెలంగాణ వాసులకు కూడా వర్తింపజేయాలని ఆమె కోరారు.