అంత్యక్రియల సమయంలో స్మశానంలోకి వరద.... కొట్టుకుపోయిన కాలుతున్న చితి

అంత్యక్రియల సమయంలో స్మశానంలోకి వరద.... కొట్టుకుపోయిన కాలుతున్న చితి

సోషల్ మీడియాలో ఓ వింత వీడియో వైరల్ అవుతోంది. దానిని శ్మశాన వాటికలో రికార్డ్ చేశారు. అకస్మాత్తుగా వచ్చిన నీటి ప్రవాహంలో అంత్యక్రియల చితి తేలుతూ కనిపించింది.

ఎవరైనా చనిపోయిన తర్వాత వారి ఆత్మకు శాంతి చేకూరాలని  వారి సంప్రదాయం, అనేక ఆచారాలు నిర్వహిస్తారు.  ఇలా చేయడం వల్ల వారి  ఆత్మ త్వరగా మోక్షం పొందుతుందని నమ్ముతారు. హిందూమతంలో, మరణం తరువాత  అంత్యక్రియలు (దహనం)  చేస్తారు.   అయితే వైరల్ అవుతున్న వీడియో దహనమవుతున్న చితి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది.  ఇక అంతే దీనిని అక్కడున్న వారు సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్ట్ చేశారు.  

ఉత్తరాఖండ్‌ లో ఓ వ్యక్తి చనిపోవడంతో బంధువులు వచ్చి శ్మశాన వాటికలో మృతదేహాన్ని దహనం చేశారు. అన్ని పూజల అనంతరం మృతదేహాన్ని దహనం చేశారు.  కాలిపోతున్న మృతదేహం దగ్గర కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అందరూ ఒడ్డున చూస్తూ నిలబడ్డారు.  అయితే అకస్మాత్తుగా  బలమైన నీటి ప్రవాహం వచ్చింది.  ఈ ఉప్పెనను చూసి అందరూ పక్కదారి పట్టారు. కాలిపోతున్న మృతదేహం నీటి ప్రవాహంలో  కొట్టుకుపోయింది. మృతదేహం ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలియలేదు.దీని వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది.


ఈ  వీడియో షేర్ చేయబడిన వెంటనే వైరల్ అయ్యింది. నది మధ్యలో మృతదేహాన్ని తగలబెట్టేది ఎవరు? అని ప్రజలు కామెంట్లలో  రాశారు. అతనికి మోక్షం లభించిందని చాలామంది రాశారు. గంగామాత స్వయంగా ఆయనను తీసుకెళ్లడానికి వచ్చింది. ఆయన పంచ భూతాల్లో  విలీనం అయ్యాడని అని ఒక వినియోగదారు  రాశారు. మరికొందరు దీనిని నేరుగా స్వర్గ ప్రవేశం అన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు.