- షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం
- ముంబైలో ఘటన
ముంబై: ముంబైలో ఘోరం జరిగింది. ఇంట్లో మంటలు అంటుకుని, ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఈ ఘటన చెంబూర్ ఏరియాలోని సిద్ధార్థ్ కాలనీలో జరిగింది.
క్కడున్న రెండతస్తుల బిల్డింగ్ లో కింద ఎలక్ట్రికల్ షాప్ ఉండగా, పైన ఫ్లోర్ లో బాధిత కుటుంబం ఉంటున్నది. ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు షాప్ లో మంటలు చెలరేగి, పైన ఫ్లోర్ కు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ళ్లను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పారు. ఫైర్ సిబ్బంది మూడు గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
నిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఘటనా స్థలాన్ని సీఎం ఏక్ నాథ్ షిండే పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై హైలెవల్ ఇన్వెస్టిగేషన్ కు ఆదేశించారు.