
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నారా రోహిత్ నటిస్తోన్న 20వ చిత్రం కాగా, వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆసక్తిని పెంచాయి. శుక్రవారం ఈ చిత్రం నుంచి మూడో పాటను రిలీజ్ చేశారు. ‘డియర్ ఐరా’ అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్‌ను లియోన్ జేమ్స్ కంపోజ్ చేయడంతోపాటు కీర్తన వైద్యనాథన్‌తో కలిసి పాడిన తీరు ఆకట్టుకుంది. శ్రీహర్ష ఇమాని లిరిక్స్ రాశాడు.
‘తెలిశాకే చిరునామా, కలిగిందే ఒక ధీమా.. కొంచెం కొంచెం పుట్టేసిందే ప్రేమ. నువ్వు నేను కుడి ఎడమ, కలిసే కనిపెడదామా.. ముందు ముందు ఏం రాశాడో ఆ బ్రహ్మా’ అంటూ సాగిన పాటలో నారా రోహిత్, వృతి వాఘాని జోడీ ఆకట్టుకుంది. నరేష్, వాసుకి ఆనంద్, సత్య, అజయ్, వీటీవీ గణేష్, అభినవ్ గోమటం ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.