
జీవీ ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన చిత్రం డియర్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకుడు. వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు. ఏప్రిల్ 12న విడుదలవుతున్న సందర్భంగా సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అతిథులుగా హాజరైన హీరో సందీప్ కిషన్, నిర్మాత నాగవంశీ, దర్శకులు నందిని రెడ్డి, వెంకీ అట్లూరి మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.
జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ‘అందరూ రిలేట్ చేసుకునే సినిమా ఇది. మంచి ఎమోషన్స్ ఉంటాయి’ అని అన్నాడు. సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్స్ నుంచి చిరునవ్వుతో బయటికి వస్తారని చెప్పింది ఐశ్వర్య రాజేష్. ఆనంద్ మాట్లాడుతూ ‘గురక పెట్టడం ప్రతి ఇంట్లో సమస్య. దీనిపై కథ రాయడం ఎక్సయిటింగ్‌గా అనిపించింది’ అని అన్నాడు. తెలుగులో రిలీజ్ చేస్తోన్న అన్నపూర్ణ స్టూడియోస్, ఏషియన్ సినిమాస్ సంస్థలకు థ్యాంక్స్ అని నిర్మాతలు చెప్పారు.