ఫిలిప్పీన్స్ లో 'రాయ్' బీభత్సం

ఫిలిప్పీన్స్ లో 'రాయ్' బీభత్సం

రాయ్ తుఫాను ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేసింది. తుఫాను ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. టైఫూన్ కారణంగా ఇప్పటి వరకు 208 మంది మృత్యువాతపడ్డారు. మరో 52 మంది గల్లంతయ్యారు. రాయ్ తుఫాను ప్రభావంతో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈదురు గాలుల ధాటికి సియార్గావో, దినాగట్, మిండనావో దీపుల్లో భారీ విధ్వంసం జరిగింది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. రాయ్ సృష్టించిన విలయం కారణంగా దాదాపు 3లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
తుఫాను వల్ల ఫిలిప్పీన్స్ లోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. చాలా ప్రాంతాలు ఇంకా అంధకారంలోనే ఉన్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాలతో రవాణా సంబంధాలు తెగిపోయాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న సెంట్రల్ ఫిలిప్పీన్స్ లో లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతంలో అందరినీ కాపాడినట్లు రెడ్ క్రాస్ ప్రకటించింది. 
క్రిస్మస్ సమయం కావడంతో సియార్గావో ద్వీపానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. వారంతా తుఫాన్ సృష్టించిన విధ్వంసం కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది వారికి అవసరమైన ఆహారం, మంచి నీరు అందిస్తున్నారు.

For more news

సోమాలియా నుంచి వచ్చిన వ్యక్తికి గాంధీలో చికిత్స

ఐశ్వర్యారాయ్కు ఈడీ నోటీసులు