పంట కోయక ముందే నిర్ణయం ప్రకటించాలి

పంట కోయక ముందే నిర్ణయం ప్రకటించాలి
  • కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి

హైదరాబాద్: వానాకాలం పంట కోయక ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేసి స్పష్టమైన ప్రకటన చేయాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్, రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీలు గందరగోళం చేశారని.. మిగిలిన ధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎటువంటి హామీలు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం కొనుగోలు చేయడం లేదంటూ చివరికి ధాన్యాన్ని దళారులకు అమ్ముకునేలా చేశారని ఆరోపించారు కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేశ్ రెడ్డి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు (ఎఫ్.సి.ఐ)కి నాలుగు సంవత్సరాల నుంచి ఎంత ధాన్యం పంపించారో చెప్పాలన్నారు.