మరోసారి చార్జీలు పెంచాలని నిర్ణయించిన ఆర్టీసీ

మరోసారి చార్జీలు పెంచాలని నిర్ణయించిన ఆర్టీసీ

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో మరోసారి చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నారు. స్పెషల్​ అకేషన్స్​లో ఎక్స్​ప్రెస్, డీలక్స్, సూపర్​ లగ్జరీ, వోల్వో బస్సులలో సాధారణ చార్జీల కంటే 1.25 రెట్లు ఎక్కువగా వసూలు చేసుకోడానికి మేనేజింగ్​ డైరెక్టర్​ మంగళవారం సర్య్కులర్​ జారీ చేశారు.
త్వరలో రవాణా ట్యాక్స్ ల పెంపు!
ఇప్పటికే పెట్రో ధరలతో అల్లాడుతున్న వాహనదారులపై మరో పిడుగు పడనుంది. ట్రాన్స్ పోర్ట్ ట్యాక్స్ లను పెంచేందుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది. లైఫ్‌‌ ట్యాక్స్‌‌, గ్రీన్‌‌ ట్యాక్స్‌‌ లను పెంచడంతో పాటు కొత్తగా రోడ్‌‌ సేఫ్టీ సెస్‌‌ అమలు చేయనుంది. రూ.50 వేల విలువైన బైక్‌‌లకు ఇప్పుడు లైఫ్‌‌ ట్యాక్స్ 9 శాతం ఉండగా, దాన్ని 12 శాతానికి పెంచనుంది. ఆటోలు, కార్లు, జీపులు, మినీ బస్సులైతే రూ.10 లక్షల లోపు ధర ఉంటే 12 శాతం, ఆపై ధర ఉండే వాటికి 14 శాతం విధించనుంది. ఇక ఏడేండ్ల నుంచి పదేండ్ల లోపు వాహనాలకు ఒక క్వార్టర్లీ ట్యాక్స్‌‌లో సగం మేర.. ఆ ఏడాదికి గ్రీన్‌‌ ట్యాక్స్‌‌ పేరుతో వసూలు చేయనుంది.

12 ఏండ్లు దాటిన వాహనాలైతే క్వార్టర్లీ ట్యాక్స్‌‌కు సమానంగా, ఆపై వాహనాలైతే రెట్టింపు స్థాయిలో బాదనుంది. మరోవైపు కొత్తగా రోడ్‌‌ సేఫ్టీ సెస్‌‌ను తీసుకురానుంది. రిజిస్ట్రేషన్‌‌ టైమ్​లో బైక్‌‌లకు రూ.500, ఫోర్‌‌ వీలర్స్‌‌కు రూ.2 వేలు, ఇతర ట్రాన్స్‌‌పోర్ట్‌‌ వెహికల్స్‌‌కు రూ. 2,500 వసూలు చేయనుంది. పన్నుల పెంపుతో మొత్తంగా రూ.2 వేల కోట్లు రాబట్టుకోవాలని రవాణా శాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.