ఫైర్ సేఫ్టీ లేని కాలేజీల్లో చేరితే డిక్లరేషన్ ​కంపల్సరీ

 ఫైర్ సేఫ్టీ లేని కాలేజీల్లో చేరితే  డిక్లరేషన్ ​కంపల్సరీ

హైదరాబాద్, వెలుగు: ఫైర్ సేఫ్టీ లేని ప్రైవేటు ఇంటర్ కాలేజీల్లో చేరే స్టూడెంట్ల నుంచి తప్పనిసరిగా డిక్లరేషన్ తీసుకోవాలని ఇంటర్​బోర్డు ఆదేశించింది. సంబంధిత మోడల్ ఫారాన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ పంపించారు.

స్టూడెంట్లతో ఫారాలు నింపించి వాటిని కాలేజీ మేనేజ్మెంట్లు తమవద్దే పెట్టుకోవాలని సూచించారు. డిక్లరేషన్ ఫారాలను తీసుకోకపోతే  మేనేజ్మెంట్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఇంటర్ బోర్డు నుంచి  వచ్చిన ప్రొసిడింగ్​ను  నోటీసు బోర్డులో పెట్టాలని నవీన్ మిట్టల్  స్పష్టం చేశారు.