కేసీఆర్​, కేటీఆర్​ లేకపోయినా.. ఉద్యమం ఉండేది

కేసీఆర్​, కేటీఆర్​ లేకపోయినా.. ఉద్యమం ఉండేది

ముషీరాబాద్, వెలుగు: తొలి, మలి దశ తెలంగాణ అమరవీరులందరి వివరాలను ప్రభుత్వం ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్​లోని విద్యానగర్​లో నిర్వహించిన ఉద్యమకారుల వేదిక సన్నాహక కమిటీ సమావేశంలో ఎర్ర సత్యనారాయణ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అమరులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. 

‘కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా’ అన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేసీఆర్, కేటీఆర్ లేకపోయినా తెలంగాణ ఉద్యమం ఉండేదని.. కానీ తెలంగాణ నినాదం లేకపోతే కేటీఆర్ ఉండేవారు కాదన్నారు. ఉద్యమకారులు ప్రఫూల్ రాంరెడ్డి, డి.శంకర్, నిర్మల, దేశ్ పాండే, అరుణ, చంద్రుడు యాదవ్, పి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.