రెస్టారెంట్లకు డిస్కౌంట్ల దెబ్బ

రెస్టారెంట్లకు డిస్కౌంట్ల దెబ్బ
  • తట్టుకోలేక ఫుడ్ డెలివరీ కంపెనీలకు గుడ్‌‌బై
  • ఉన్నట్టుండి ఆపేయడం ఏంటంటూ జొమాటో నోటీసులు

రెస్టారెంట్లకు, ఫుడ్‌‌‌‌ అగ్రిగేట్ ప్లాట్‌ ఫామ్స్ మధ్య అగ్గి రాజుకుంది. ఫుడ్ అగ్రిగేటర్లు ఆఫర్ చేస్తోన్నడిస్కౌంట్ల ధాటిని తట్టు కోలేక.. వందల కొద్దీరెస్టారెంట్లు ఆ ప్లాట్‌ ఫామ్స్ నుంచి బయటికివచ్చేశాయి. దీంతో చెప్పా పెట్టకుం డా మూకుమ్మ-డిగా బయటికి వచ్చిన రెస్టారెంట్లకు ఫుడ్ డిస్కవ-రీ ప్లాట్‌ ఫామ్‌‌‌‌ జొమాటో హుకుం జారీ చేసింది.ఒకవేళ జొమాటో గోల్డ్ డిస్కౌంటింగ్ స్కీమ్నుంచి బయటికి వచ్చేయాలనుకుం టే.. ముందేతమకు సమాచారం అందిం చాలని పార్టనర్రెస్టారెంట్లకు తెలిపింది.అంతేకాక ముందస్తు గా45 రోజుల నోటీసు పీరియడ్ కూడా అవసరమనిజొమాటో తన గోల్డ్ స్కీమ్ పార్టనర్ రెస్టారెంట్లనుఆదేశించింది.

ఫుడ్ అగ్రిగేటర్లు ఆఫర్ చేస్తోన్న భారీ డిస్కౌంట్లనుతాము భరించలేకపోతున్నామని… గుర్గావ్ , ఢిల్లీ,ముంబైలలో 300 ప్రముఖ రెస్టారెంట్ బ్రాండ్లు ,జొమాటో, ఈజీడిన్నర్, నియర్‌‌‌‌‌‌‌‌బై, మ్యాజిక్‌ పిన్ ,గౌర్మెట్ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ వంటి ప్లాట్‌ ఫామ్స్‌‌‌‌ నుంచిడీలిస్టయ్ యాయి. డైనిన్‌ ప్రొగ్రామ్స్ నుంచి ఎగ్జిట్అవ్వా లని కూడా నిర్ణయించుకున్నాయి. రెస్టా-రెంట్లు ఇప్పటి కే భారీగా ఉన్న అద్దెలు, ఇన్‌ పుట్ట్యాక్స్ క్రెడిట్లు రాకపోవడం వంటి వాటితోసతమతమవుతున్నాయి. అగ్రిగేటర్లు ఆఫర్ చేసేడిస్కౌంట్లు చాలా అధికమయ్యాయని నేషనల్ రె-స్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్రాహుల్ సింగ్ అన్నారు. ఇలా డీలిస్ట్ అవడంతోజొమాటో లాంటి ప్లాట్‌ ఫామ్‌‌‌‌ ఆఫర్ చేసే భారీడిస్కౌంట్లకు స్వస్తి పలకడమే లక్ష్యమని నేషనల్రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ ఆ-ర్‌‌‌‌‌‌‌‌ఏఐ) తెలిపింది. డిస్కౌంట్లతో వ్యాపారాలు దె-బ్బతింటు న్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈవిషయంపై రెస్టారెంట్ అగ్రిగేటర్లు కూడా తమనుకలిశారని ఎన్‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఏఐ తెలిపింది. మరికొంతమం-ది కూడా తమను కలువబోతున్నారని పేర్కొంది.ఎన్‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఏఐ ప్రతినిధులతో సోమవారం నుంచిచర్చలు జరుపబోతున్నట్టు ఈజీడైనర్స్ సహ వ్య-వస్థా పకుడు సచిన్ పబ్రేజా చెప్పా రు. డైన్‌ అవుట్ కూడా ఎన్‌ ఆర్‌‌‌‌‌‌‌‌ఏఐ ను కలిసినట్టు కంపెనీ అధికారప్రతినిధి చెప్పా రు. ఇప్పటి వరకు మరికొన్ని రెస్టా-రెంట్లు కూడా ఈ యాప్స్‌‌‌‌ నుంచి డీలిస్ట్ అవుతున్నాయి. కన్స్యూమర్ సెంటిమెంట్ తగ్గడం, రెంటల్స్ పెరగడం, ఇన్‌ పుట్ ట్యాక్స్ క్రెడిట్ తొలగించడం వంటివి తమకు భారంగా ఉన్నాయని రెస్టారెంట్లు చెబుతున్నాయి. దీనికి తోడు డిస్కౌంట్లు అంటే కష్టతరమని పేర్కొంటున్నాయి.

45 రోజుల నోటీసు అవసరం… జొమాటో

డీలిస్ట్‌‌‌‌ అయిన గోల్డ్ పార్టనర్ రెస్టారెంట్లకు జొమాటో ఈమెయిల్ చేసింది. ప్రస్తు త నియమ, నిబం ధనల నుంచి ప్రకారం బయటికి వచ్చేయాలంటే.. 45 రోజుల నోటీసు అవసరమని జొమాటో పేర్కొంది. యూజర్లకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సేవలందిం చడానికి ఈ నోటీసు అవ సరమని తెలిపింది. ఒకవేళ మళ్లీ గోల్డ్ ప్లాట్‌ ఫామ్‌‌‌‌లో లాగిన్ అవ్వా లనుకుం టే.. సైనప్‌ ఫీజు చెల్లించాలని కూడా తెలిపింది. ప్రస్తు తం జొమాటో గోల్డ్‌‌‌‌లో 10 లక్షల మంది సబ్‌ స్క్రైబర్లు, 6500 రెస్టారెంట్లు పార్టనర్లుగా ఉన్నారు. ‘ మిగతా నిర్ణయాల మాదిరే ఈ పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌ లో జాయిన్ అవ్వడం, కంటి న్యూ కావడం పూర్తిగా మీ నిరయ్ణం మేరకే ఉంటుం ది. మీ వ్యాపారాలు సమర్థవంతంగా, సౌకర్యవంతంగా నిర్వహిం చుకోవచ్చు’ అని జొమాటో రెస్టారెంట్ పార్టనర్లకు రాసిన లేఖలో పేర్కొంది. యూజర్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియన్స్‌‌‌‌ను మనం రక్షించాల్సి ఉందని, ఒకవేళ ప్రొగ్రామ్ నుంచి డీలిస్ట్ కావాలనుకుం టే, ముందు నోటీసు పిరియడ్ ఇవ్వా లని సూచించింది. కాంట్రాక్ట్ ప్రకారం, 45 రోజుల నోటీసు పిరియడ్ అవసరమని పేర్కొంది.