Deepika Padukone: కళ్లు తిప్పుకోలేని విధంగా..రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌

Deepika Padukone: కళ్లు తిప్పుకోలేని విధంగా..రణ్‍వీర్‌తో కలిసి దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీ ఫొటోషూట్‌

నార్త్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది. 

రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది (2024) సెప్టెంబర్లో తమ తొలి సంతానాన్ని పొందబోతున్న బోల్డ్ ఓపెన్ బ్లేజర్స్, షీర్ దుస్తుల్లో దీపిక పదుకొణ్ మెటర్ని ఫొటోషూట్‌ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. భర్త రణ్‍వీర్ సింగ్‍తో కలిసి ఫొటోలకు పోజులు ఇచ్చారు. "సెప్టెంబర్ 2024" అని దీనికి క్యాప్షన్ పెట్టారు. 

దీపికాను వెనుక నుంచి రణ్‍వీర్ ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్న ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. మొత్తంగా 14 స్టన్నింగ్ ఫొటోలతో ఈ బాలీవుడ్ సెలబ్రెటీ జంట ట్రెండింగ్ లో ఉంది. ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ లోనూ అటు బోల్డ్ గానూ, సరదాగానూ ఉన్న ఈ ఫొటోలు అందరికీ చూడముచ్చటగా నచ్చేస్తున్నాయి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలను చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ తల్లిదండ్రులు కావడం ఆనందంగా ఉందని కొందరు..దీపిక‌కి పండంటి బిడ్డ పుట్టాలంటూ మరికొందరు మెసేజెస్ ల ద్వారా కోరుకుంటున్నారు.

ఫిబ్రవరి 29న అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్‌ల వివాహం సందర్భంగా దీపికా పదుకొణె గర్భంతో కనిపించింది. ఆతర్వాత దీపికా నటించిన కల్కి సినిమా ప్రమోషన్స్ లో కనిపించింది. ఇక ఇప్పుడు ఇలా ఫోటో షూట్‌ను పంచుకుంది.