పూల గౌనులో మెరిసిన దీపిక

పూల గౌనులో మెరిసిన దీపిక

ఫ్రాన్స్ లోని కేన్స్ లో జరుగుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో దీపికా పదుకొనే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. రోజుకో డ్రెస్సుతో దిగిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేస్తూ నెటిజన్ల మది దోస్తున్నారు. తాజాగా అప్ లోడ్ చేసిన ఒక ఫొటోలో.. లేత ఆకుపచ్చ రంగు గౌన్ ను ధరించి, చిరునవ్వులు చిందిస్తూ  దీపిక తళుక్కుమన్నారు. గులాబీ పూలు, ఆకులతో ఉన్న ఆ డ్రెస్సు వల్ల దీపిక అందం మరింత ఇనుమడించింది. ఆ డ్రెస్సుకు మ్యాచ్ అయ్యే బూట్లను కూడా ఆమె ధరించారు. ఈ ఫొటోకు కొన్ని గంటల్లోనే ఇన్ స్టాగ్రామ్ లో 11.40 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.

తదుపరి సినిమాలివీ..

తదుపరిగా విడుదల కాబోయే దీపిక సినిమాల్లో ‘పఠాన్’ ఉంది. ఇందులో హీరోగా షారుఖ్ ఖాన్ , జాన్ అబ్రహం ప్రధాన పాత్రలు పోషించనున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ‘ఫైటర్’ మూవీలోనూ దీపిక నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. హీరో ప్రభాస్ తో కలిసి ‘ప్రాజెక్ట్ - కే’  అనే సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ దీపిక నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్  ప్రధాన పాత్రలో బాలీవుడ్ మూవీ ‘ది ఇంటెర్న్’ రీమేక్ జరుగుతోంది. దీనిలోనూ దీపిక ప్రధాన పాత్ర పోషించనున్నారు. 


మరిన్ని వార్తలు..

మాజీ ప్రధాని దేవెగౌడతో కేసీఆర్ భేటీ

2న కియా ఎలక్ట్రిక్ కారు విడుదల.. మొదలైన బుకింగ్స్