విమెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌లో దీప్తి శర్మకు నిరాశ

విమెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌లో దీప్తి శర్మకు నిరాశ

న్యూఢిల్లీ: విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఆల్‌‌‌‌‌‌‌‌రౌండ్‌‌‌‌‌‌‌‌ షో చూపెట్టిన దీప్తి శర్మకు విమెన్స్‌‌‌‌‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీగ్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌)లో నిరాశ ఎదురైంది. ఆమెను యూపీ వారియర్స్‌‌‌‌‌‌‌‌ రిటేన్‌‌‌‌‌‌‌‌ చేసుకోలేదు. మెగా టోర్నీలో దీప్తి  215 రన్స్‌‌‌‌‌‌‌‌, 22 వికెట్లు తీసి ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద టోర్నీగా నిలిచింది. అలాగే గతేడాది డబ్ల్యూపీఎల్‌‌‌‌‌‌‌‌లోనూ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ద టోర్నీగా నిలిచినా ఫ్రాంచైజీ ఆమెపై కరుణ చూపలేదు. కేవలం శ్వేత సెహ్రావత్‌‌‌‌‌‌‌‌ (రూ. 50 లక్షలు)ను మాత్రమే ఫ్రాంచైజీ రిటేన్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. 

స్టార్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్‌‌‌‌‌‌‌‌ స్మృతి మంధానాను రాయల్‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌ బెంగళూరు (ఆర్‌‌‌‌‌‌‌‌సీబీ) రిటేన్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో  ఆమెకు రూ. 3.5 కోట్లు చెల్లించనుంది. రిచా ఘోష్‌‌‌‌‌‌‌‌ (రూ. 2.75 కోట్లు), ఎలైస్‌‌‌‌‌‌‌‌ పెర్రీ (రూ. 2 కోట్లు), శ్రేయాంక పాటిల్‌‌‌‌‌‌‌‌ (రూ. 60 లక్షలు) కూడా ఆర్‌‌‌‌‌‌‌‌సీబీకి ఆడనున్నారు. ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ సివర్‌‌‌‌‌‌‌‌ బ్రంట్‌‌‌‌‌‌‌‌ (రూ. 3.5 కోట్లు), హర్మన్‌‌‌‌‌‌‌‌ప్రీత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (రూ. 2.5 కోట్లు), హీలీ మాథ్యూస్‌‌‌‌‌‌‌‌ (రూ. 1.75 కోట్లు), అమన్‌‌‌‌‌‌‌‌జోత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (రూ. 1 కోటి), కమలిని (రూ. 50 లక్షలు) అట్టి పెట్టుకున్నారు. 

గుజరాత్‌‌‌‌‌‌‌‌ జెయింట్స్‌‌‌‌‌‌‌‌లో ఆష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌ (రూ. 3.5 కోట్లు), బెత్‌‌‌‌‌‌‌‌ మూనీ (రూ. 2.5 కోట్లు).. ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌ జెమీమా రొడ్రిగ్స్‌‌‌‌‌‌‌‌ (రూ. 2.2 కోట్లు), షెఫాలీ వర్మ (రూ. 2.2 కోట్లు), అనాబెల్‌‌‌‌‌‌‌‌ సదర్లాండ్‌‌‌‌‌‌‌‌ (రూ. 2.2 కోట్లు), మరిజానె కాప్‌‌‌‌‌‌‌‌ (రూ. 2.2 కోట్లు), నికీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌ (రూ. 50 లక్షలు)ని రిటేన్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నారు. లారా వోల్‌‌‌‌‌‌‌‌వర్ట్‌‌‌‌‌‌‌‌, అలీసా హీలీ, మెగ్‌‌‌‌‌‌‌‌ లానింగ్‌‌‌‌‌‌‌‌, అమెలియా కెర్ర్ ను వేలంలోకి వదిలిపెట్టారు.