V6 News

డిఫెన్స్ లిక్కర్ స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు

డిఫెన్స్ లిక్కర్ స్వాధీనం.. పోలీసుల అదుపులో నిందితుడు

అల్వాల్, వెలుగు: అక్రమంగా విక్రయిస్తున్న డిఫెన్స్​ లిక్కర్​ను పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కౌకూర్ లోని శ్యామల కన్వెన్షన్ వెంకటేశ్వర నగర్ సమీపంలో అమరేందర్ రెడ్డి అనే  వ్యక్తి గురువారం డిఫెన్స్ బాటిల్స్ అమ్ముతున్నాడు. సమాచారం అందుకున్న ఎస్టీఎఫ్​ ‘డి’ టీం సీఐ నాగరాజు, ఎస్సై జ్యోతి తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడినిఅల్వాల్ ఎక్సైజ్ స్టేషన్​లో అప్పగించారు.