ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఆపలేదు

ప్రపంచంలో ఏ శక్తీ మనల్ని ఆపలేదు

బార్డర్‌లో బరాబర్‌ గస్తీ

చైనా చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉంటలే
మనమూ కౌంటర్‌గా బలగాలు మోహరించాం
సరిహద్దు పరిస్థితిపై రాజ్యసభలో డిఫెన్స్​ మినిస్టర్ ప్రకటన
ఆర్మీకి పార్టీలకతీతంగా మద్దతు

న్యూఢిల్లీ: లడఖ్ లోని బార్డర్ లో పెట్రోలింగ్ చేయకుండా ఇండియన్ సోల్జర్లను ప్రపంచంలోని ఏ శక్తీ ఆపలేదని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. మన సైనికులు ఇందుకోసమే ప్రాణాలను త్యాగం చేశారన్నారు. తూర్పు లడఖ్ లో ప్రస్తుత పరిస్థితిపై గురువారం ఆయన రాజ్యసభలో ప్రకటన చేశారు. గాల్వన్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో ఇండియన్ సోల్జర్లు పెట్రోలింగ్ చేయకుండా అడ్డుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ అడిగిన ప్రశ్నకు క్లారిఫికేషన్ ఇచ్చారు.

చెప్పేదొకటి.. చేసేదొకటి..

సరిహద్దుల్లో చైనా దళాలను సమీకరించిందని, ప్రతిస్పందనగా మన ఆర్మీ కూడా కౌంటర్ డెప్లాయ్ మెంట్ చేసిందని రాజ్ నాథ్ తెలిపారు. ‘‘ఆగస్టు 29, 30 మధ్య పాంగోంగ్ లేక్ సౌత్ బ్యాంక్ ప్రాంతంలో స్టేటస్ కో మార్చేందుకు రెచ్చగొట్టే సైనిక విన్యాసాలకు చైనా పాల్పడింది. ఒకవైపు ఉద్రిక్తతలను తగ్గించేందుకు మిలటరీ, డిప్లమాటిక్ చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇలా చేసింది. చైనా చెప్పే మాటలకు, చేసే పనులకు సంబంధం ఉండటం లేదు. ‘ఉన్ కీ కథానీ ఔర్ కర్నీ అలగ్ హయ్‘ (వాళ్ల మాటలు, చర్యలు భిన్నంగా ఉన్నాయి)’’ అని అన్నారు.

‘బార్డర్’ పరిష్కారం కాలే

బార్డర్ లో పెట్రోలింగ్ కారణంగానే వాగ్వాదం, గొడవ జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ అభిప్రాయపడ్డారు. ఇండియా, చైనా సరిహద్దు సమస్యను ఇంకా పరిష్కరించుకోలేదని చెప్పారు. ‘‘రెండు దేశాల సరిహద్దుల్లోని కస్టమరీ, ట్రెడిషనల్ అలైన్ మెంట్ ను చైనా అంగీకరించదు. అగ్రిమెంట్లు, ట్రీటీల ద్వారా కన్ఫార్మ్ చేసిన జియోగ్రాఫికల్ ప్రిన్సిపల్స్ పై ఈ అలైన్ మెంట్ ఆధారపడి ఉందని మేం నమ్ముతున్నాం’’ అని చెప్పారు.

లడఖ్, పీఓకేలో ఆక్రమణలు

‘‘లడఖ్ లో 38 వేల చదరపు కిలోమీటర్ల మేర చైనా ఆక్రమించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 5,180 చదరపు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని అధీనంలో ఉంచుకుంది’’ అని రాజ్ నాథ్ వెల్లడించారు. ‘‘గత ఏప్రిల్ నుంచి తూర్పు లడఖ్ లోని బార్డర్ లో చైనా ట్రూప్స్, ఆయుధాలను తరలిస్తోంది. నిర్మాణాలు చేపడుతోంది. మన ఆర్మీ సాధారణంగా, సంప్రదాయంగా నిర్వహించే పెట్రోలింగ్ ప్యాటర్న్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో అది గొడవకు కారణమైంది’’ అని వివరించారు. ‘‘జూన్ 6న జరిగిన సమావేశంలో సీనియర్ కమాండర్ల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఎల్ఏసీకి కట్టుబడి ఉండాలని రెండు వర్గాలు నిర్ణయించాయి. స్టేటస్ కోను మార్చేందుకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని నిర్ణయించాయి. కానీ చైనా వైపు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. దీంతో జూన్ 15న గొడవ జరిగింది. మన సైనికులు వీరమరణం పొందారు. చైనా వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పారు’’ అని చెప్పారు

ఏప్రిల్ నాటి పరిస్థితి కొనసాగాలి: ప్రతిపక్షాలు

ఇండియా, చైనా బార్డర్ లో ఏప్రిల్ నాటి స్టేటస్ కోను రీస్టోర్ చేయాలని రాజ్యసభలో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. సరిహద్దుల్లో దేశం కోసం పోరాడుతున్న మన ఆర్మీకి పార్టీలకతీతంగా నేతలు మద్దతు ప్రకటించారు. సంఘీభావం తెలిపారు. మూడు నెలలుగా సాగుతున్న బార్డర్ గొడవను పరిష్కరించాలని కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ఏకే ఆంటోనీ కోరారు. ఏప్రిల్ కి ముందు నాటి పరిస్థితిని పునరుద్ధరించాలన్నారు. ఈ సమయంలో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. సున్నితమైన అంశంపై చర్చ ఉండదని ప్రభుత్వం, ప్రతిపక్షాలు గతంలోనే నిర్ణయించాయని గుర్తుచేశారు. అయితే రాజ్ నాథ్ ప్రకటనపై సభ్యులు క్లారిటీ తీసుకునేందుకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అనుమతి ఇచ్చారు. దీంతో మరికొందరు నేతలు మాట్లాడారు.

చైనా సిన్సియర్ గా పని చేయాలి

పాంగోంగ్ లేక్ సహా అన్ని వివాదాస్పద ప్రాంతాల నుంచి బలగాల డిస్ ఎంగేజ్ మెంట్ కోసం చైనా తమతో సిన్సియర్ గా పని చేయాలని ఇండియా సూచించింది. ఎల్ఏసీని చైనా గౌరవిస్తుందని తాము ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ స్పోక్స్ పర్సన్ అనురాగ్ శ్రీవాస్తవ అన్నారు. స్టేటస్ కోను మార్చేందుకు ఏకపక్ష ప్రయత్నాలు చేయొద్దని సూచించారు.

పంజాబీ పాటలు అందుకేనా..

లడఖ్ లోని ఫార్వర్డ్ పోస్టుల్లో మోహరించిన చైనా బలగాలు లౌడ్ స్పీకర్లలో పంజాబీ పాటల మోత మోస్తున్నాయి. ప్రస్తుతం ఫింగర్ 4లోని ఎత్తయిన ప్రాంతాల్లో పహారా కాస్తున్న ఇండియన్ బలగాల దృష్టి మళ్లించేందుకే ఇలా చేసినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. గతంలో మాదిరి ఈ మానసిక యుద్ధ వ్యూహాన్ని చైనా సైన్యం ఉపయోగిస్తోందని తెలిపాయి. ఇండియన్ సైనికులను బెదిరించేందుకు, తమకు ఇండియన్ భాషలు తెలుసని చెప్పేందుకు 1962 యుద్ధానికి కొన్ని రోజుల ముందు కూడా ఇలానే హిందీ పాటలను చైనా ఆర్మీ ప్లే చేసింది. ఇలా గట్టిగా పాటలు పెట్టడం ద్వారా.. ‘మీ కదలికలను మేం గమనిస్తున్నాం’ అని పరోక్షంగా చెప్పింది. ఇండియా చర్యల వల్ల తామేం వర్రీ కావడం లేదని చెప్పేందుకు కూడా చైనా ట్రూప్స్ పాటలు ప్లే చేస్తున్నాయని ఆర్మీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మన సముద్ర జలాల్లోకి చైనా షిప్

మిలటరీ చర్చలు, బార్డర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. ఆగస్టులో మలక్కా జలసంధి నుంచి భారతీయ జలాల్లోకి చైనా యువాన్ వాంగ్-క్లాస్ రీసెర్చ్ షిప్ ప్రవేశించినట్లు ఇండియన్ నేవీ గుర్తించింది. ఈ ప్రాంతంలో మోహరించిన ఇండియన్ నేవీ షిప్ లు చైనా నౌకను నిరంతరం ట్రాక్ చేశాయి. తర్వాత కొన్ని రోజులకు అది తిరిగి చైనా సముద్ర జలాల్లోకి వెళ్లిపోయింది. అంతకుముందు 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి దాకా నాలుగు నుంచి ఆరు చైనా రీసెర్చ్ షిప్ లు ఇండియన్ ఓషన్ రిజియన్ లో కనిపించాయి.

For More News..

మీ ప్రైవసీకి భంగం కలగకుండా.. ‘దూస్రా’ నెంబర్

77 ఏళ్ల వయసులో కొత్త బిజినెస్.. ఫుల్ సక్సెస్

ప్రైవేట్ ట్రావెల్స్‌కు రూట్ క్లీయర్ చేస్తున్న సర్కార్