Argentina vs Algeria: ఫుట్‌బాల్ ప్రపంచంలోనే మోస్ట్ అవేటెడ్ మ్యాచ్‌లలో ఒకటైన అర్జెంటీనా వర్సెస్ అల్జీరియా గ్రూప్-జె పోరుకు సమయం ఆసన్నమైంది. 2022 ఖతార్ వరల్డ్ కప్‌లో ఎట్టకేలకు తన కలల ట్రోఫీని ముద్దాడి ఫుట్‌బాల్ సామ్రాజ్యాన్ని శాసించిన లెజెండ్ లయెనల్ మెస్సి.. ఇప్పుడు మళ్లీ అందరి కళ్లూ తనవైపే తిప్పుకున్నాడు. బహుశా తన కెరీర్‌లో ఇదే చివరి వరల్డ్ కప్ కానుండటంతో, బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ కొట్టి హిస్టరీ క్రియేట్ చేయాలనే కసితో మెస్సి ఉన్నాడు.
మెస్సి డబుల్ సెంచరీ రికార్డు:
ఈ మ్యాచ్ లయెనల్ మెస్సి కెరీర్‌లో అత్యంత అరుదైనది కాబోతుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గనుక మెస్సి బరిలోకి దిగితే.. అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలో తన 200వ మ్యాచ్ (200th international cap) ఆడిన అద్భుతమైన మైలురాయిని టచ్ చేస్తాడు. కాగా జూన్ 6న హోండురాస్‌తో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌కి (ఇందులో అర్జెంటీనా 2-0తో ఈజీగా గెలిచింది) మెస్సి దూరంగా ఉన్నాడు. కానీ, గత వారం ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చి, ఒక కిర్రాక్ పెనాల్టీ గోల్ కొట్టి జట్టును 3–0తో గెలిపించాడు. దీన్ని బట్టి చూస్తే మెస్సి ఫుల్ జోష్‌లో కనిపిస్తున్నాడని క్లియర్‌గా అర్థమవుతోంది.
అర్జెంటీనా వర్సెస్ అల్జీరియా మధ్య పోరు:
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న అర్జెంటీనా.. అల్జీరియాకు ఎలాంటి షాక్ ఇస్తుందో, మెస్సి తన 200వ మ్యాచ్‌ని గోల్‌తో సెలబ్రేట్ చేసుకుంటాడో లేదో అని ఫ్యాన్స్ లో తెగ ఆసక్తి నెలకొంది. బుధవారం(జూన్17న) తెల్లవారుజామునే అలారాలు పెట్టుకుని స్క్రీన్లకు అతుక్కుపోవడానికి ఇండియన్ ఫుట్ బాల్ ఫ్యాన్స్ అందరూ అప్పుడే రెడీ అయిపోయారు.
